-బీజేవైఎం మండల కార్యదర్శి గంప రవికుమార్
నవతెలంగాణ-బెజ్జంకి : చీకటి ప్రవీణ్ కుమార్ ను బీజేపీలో చేర్చుకోవాలని బీజేవైఎం మండల కార్యదర్శి గంప రవికుమార్ గుప్తా రాష్ట్ర బీజేపీ అదిష్టానానికి మంగళవారం విజ్ఞప్తి చేశారు.ఈ నెల 13న చీకోటీ ప్రవీన్ కుమార్ బీజేపీలో చేరడానికి సమయాత్తమవ్వగా రాష్ట్ర అదిష్టానం చేరికను వాయిదా వేసిందని..ప్రవీణ్ కుమార్ ను త్వరితగతిన చేర్చుకుని రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని అదిష్టానాన్ని రవి కుమార్ విజ్ఞప్తి చేశారు.