బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం

– 18 ఏండ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలి
– చట్టాన్ని ఉల్లఘిస్తే చర్యలు తప్పవు ఎస్‌ఐ విట్టల్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
బాల్య వివాహం చేసుకోవ డం చట్టరీత్యా నేరమని కరణ్‌ కోట ఎస్సై విట్టల్‌ రెడ్డి అన్నా రు. శుక్రవారం తాండూ రు మండలం, మల్కాపూర్‌, గ్రామానికి చెందిన, కొత్త వెం కటేష్‌, అనే అబ్బాయితో ఓ గ్రామానికి చెందిన, 16 ఏండ్ల 6 నెలల అమ్మాయితో వివా హం, నిశ్చయించారు. సమా చారం రావడంతో మల్కాపూర్‌ గ్రామానికి వెళ్లి వివాహం, నిలిపివేయాలంటూ ఇరువర్గాల తల్లిదం డ్రులకు, కౌన్సిలింగ్‌ ఇచ్చి అమ్మాయిని చైల్డ్‌ లైన్‌, కమిటీ సభ్యులకు అప్పగించారు. 18 ఏండ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని హెచ్చరించారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ విట్టల్‌ రెడ్డి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రభుత్వం ఎంతో అవగాహన కల్పిస్తున్న ఇంకా మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ చైతన్యం రావడంలేదని వయసు నిండని బాలికలకు వివాహం చేసి, వారి హక్కులకు భంగం కలిగించేలా తల్లిదండ్రులు పాల్పడితే, తల్లిదం డ్రుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాల్యవి వాహాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందిం చాలన్నారు. సమాచారం ఇచ్చిన, వారి వివరాలను గోప్యంగా ఉంచి, వివాహానికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love