పిల్లలు తల్లిదండ్రుల స్థిరాస్తి కాదు : సుప్రీంకోర్టు

నవతెలంగాణ న్యూఢిల్లీ: పిల్లలు తల్లిదండ్రుల స్థిరాస్తి కాదని, వారిని జైలులో పెట్టే హక్కు తల్లిదండ్రులకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ కుమార్తెను ఇష్టం లేకుండా పెండ్లి చేసుకున్న యువకుడిపై తల్లిదండ్రులు వేసిన కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కొట్టివేస్తూ ధర్మాసనంపై విమర్శలు గుప్పించారు.
వివాహ సమయంలో బాలిక వయస్సు తక్కువగా ఉందన్న తల్లిదండ్రుల వాదన అబద్ధమని గుర్తించిన సుప్రీంకోర్టు, వివాహానికి అంగీకరించాలని బాలిక తల్లిదండ్రులను కోరింది. ‘ఆ అమ్మాయికి వయసు వచ్చింది. బిడ్డను నిర్బంధించే హక్కు లేదు. మీరు మీ స్వంత బిడ్డను స్థిరాస్తిగా మాత్రమే చూస్తారు. కానీ పిల్లలను అలా చూడలేరు’ అంటూ చీఫ్ జస్టిస్ తీవ్రంగా విమర్శించారు. మహిద్‌పూర్‌కు చెందిన వ్యక్తిపై తల్లిదండ్రులు కిడ్నాప్, లైంగిక వేధింపుల కింద కేసు పెట్టారు. బాలికకు వయస్సు ఉందని హైకోర్టు గుర్తించి యువకుడిపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.

Spread the love