బాలలు బడిలో ఉండాలి… వీధుల్లో కాదు

– జే.ఓంకార్ ములుగు జిల్లా బాలల పరిరక్షణ అధికారి
నవతెలంగాణ-గోవిందరావుపేట
బాలలు ఎప్పుడు బడిలో ఉండాలి వీధుల్లో కాదు అని ములుగు జిల్లా బాలల పరిరక్షణ అధికారి జే ఓంకార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో గ్రామ స్పెషల్ అధికారి సోమిరెడ్డి గారి అధ్యక్షతన ఆపరేషన్ మస్కన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓంకార్ హాజరై మాట్లాడారు. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలనీ గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము ములుగు  ఆధ్వర్యంలో, ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా గ్రామస్తులందరికీ బడి బయట పిల్లలకు సంబంధించిన విషయాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
పిల్లలు బడిలో ఉండాలని వీధుల్లో కాదని వారు చదువుకుంటే మంచి పౌరులుగా నిలుస్తారని వారి జీవితంలో ఎదగాలంటే చదువు చాలా ముఖ్యమని ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలని అందుకోసమని గ్రామాల్లో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను అభివృద్ధి చేయడం వల్ల పిల్లల సమస్యలు సులువుగా తెలుస్తాయని వెంటనే వాటికి  పరిష్కారం మార్గం చూసే విధంగా చూడొచ్చని తెలియజేశారు.
ప్రస్తుతము ఇప్పుడున్న సమయంలో పిల్లలందరూ డ్రగ్ కు బానిసలు అవుతున్నారు. పాఠశాల వెళ్లే విద్యార్థులలో డ్రగ్స్ కి బానిసలు అయిన పిల్లలు ఉన్నారు, అందుకని తల్లిదండ్రులు పిల్లలను గ్రహించి ముందుగా  జాగ్రత్తలు తెలియజేసి వారికి మంచి పౌరులుగా తీర్చే తీర్చే విధంగా తల్లిదండ్రులు ఆలోచించాలని,  అదేవిధంగా వాళ్ళు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి చదువు ముఖ్యమని తెలియజేయడం జరిగింది. బడి బయట పిల్లలు ఉన్న విషయము తెలిసిన వెంటనే  టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి ఫోన్ చేసి వివరాలు తెలియజేయండి అలా చేయడం వల్ల చెప్పిన వారి వివరాలు రహస్యంగా ఉండబడతాయి. మా సిబ్బంది వచ్చి అందుకు తగిన సపోర్టు వాళ్లకి ఇస్తారని చెప్పడం జరిగింది. నిస్సహాయ  స్థితిలో ఉన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే వెంటనే 1098 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి  అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి  డిసిపియు విభాగం బండారి జ్యోతి, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ రజిని, సూపర్వైజర్ విక్రమ్, పోలీసు సిబ్బంది మమత, రాకేష్ మరియు శ్రీనివాస్, గ్రామస్తులు, గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love