చలి.. గజగజ

– నడక, వాహనదారులకు తప్పని తిప్పలు
– 9 నుంచి 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
– మందగించిన వ్యాపారాలు
– జాగ్రత్తగా ఉండాలని వైద్యుల హెచ్చరిక
నవతెలంగాణ-గజ్వేల్‌
చలి వణికిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో ఇంటాబయట తిరగగానికి ఇబ్బందులు పడుతున్నారు. వేకువ జామున పొగమంచు తోడు కావడంతో చిరు వ్యాపారులు, వాహనవారులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో గడిచిన వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజు 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల తదితర మండలాల్లో ఉదయం 9 గంటల వరకు కూడా సూర్య రశ్మి బయటకు రావడం లేదు. పొగ మంచు కారణంగా వాహనదారులకు దారి కనిపించక ఇబ్బందులు పడ్డారు. పొగమంచు చలితో జిల్లాలో ప్రజలు ఇబ్బందులు, చిరు వ్యాపారులు, నడకదారులు, చలి తీవ్రతకు మరింత ఉష్ణోగ్రతలు పడిపోతాయని సంబంధిత శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గజ్వేల్‌, సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్‌ పాత తాలూక పరిధిలోని పల్లెల్లో పట్టణాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పరిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు ఇళ్లలోనే గడుపుతున్నారు. చలికి భయవ డుతున్నారు. వద్దులు పూర్తిగా ఇండ్లలోనే ఉంటున్నారు. చలి పెరగడంతో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరిగింది. జిల్లా కేంద్రంతో పాటు గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, మున్సిపల్‌ కేంద్రాల్లో అమ్మకాలు పెరిగాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిరు వ్యాపారుల వెలవెలబోతున్నాయి. కూరగాయలు, పాల వ్యాపారులు ఉదయం చలి తీవ్రతలోనే ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేస్తున్నారు. ఉదయం వేళల్లో రోజూ పొగమంచుకు ఇబ్బంది పడుతున్నారు.
జర భద్రం
చరి తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యంపై జాగ్రతగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొవిడ్‌ కొత్త వేరియింట్‌ కేసులు కూడా మొదలైన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు భరించాలని సూచిస్తున్నారు. ఆస్తమా, ఇతర శ్వాసకోస సమస్యలున్నవారు అవస్థలు పడుతు న్నారు. చలి తీవ్రంగా ఉండటంతో వ్యాపారులు వణికిపోతున్నారు. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. గుండె జబ్బులు ఉన్నవారు. గుండె ఆపరేషన్‌ వేయిం చుకున్నవారు, నడకదారులు, వాకింగ్‌ చేయవద్దని వైద్యులు చెప్తున్నారు. చలిలో ఎక్కువగా తిరగడంతో రక్తనాళాలు సంకో వించి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని, బీపీ, షుగర్‌ ఉన్నవారు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. చర్మ వ్యాధులు, ఇతర సమస్యలకు సంబంధించి ఉన్నవారు జాగ్రత్త ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన చుట్టుపక్కల ఉన్న వాతా వరణం వస్తువులు, తినే ఆహారంలో పడని పదార్థాలు కారణమవుతాయి. వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. మానసిక ఒత్తిడి ఆందోళన, అదుర్తి, అశాంతి. అలసట, దిగులు తన వారికి దూరంగా ఉండటం అతిగా భయపడడం ఇవన్నీ కూడా కారణాలయ అవకాశాలు ఉన్నాయి.
లక్షణాలు
ఉబ్బసం ఆస్తమా ఉన్న వ్యక్తికీ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది. వణికిస్తున్న చలిలో శ్వాసకు సంబందించిన వ్యాధులతో బాధపడే వారు భాగ్రత్తగా ఉండే కాలిమిది శ్వాస పీల్చుకోవడం కష్టమువుతుంది. దగ్గు మొదలైతే రెట్టింపు ఆయాసం అవుతుంది. అస్తమా ఉన్నవారు మత్యువాత పడుతున్నారు. ఊపిరితి త్తులోకి చేరిన గాలి బయటకు రావటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ శ్వాస సరిగా అందగా రోగి విపరీతమైన బాధకు గురవుతాడు. బలవంతంగా గాలి పీల్చడంతో గొంతులో పిల్లికూతలు వంటి శబ్దాలు వస్తాయి. శ్వాసరాక పోవడానికి ఉబ్బసం, దమ్ముగా కూడా పిలుస్తారు. కొన్ని రకాల పదార్థాలు పరిస్థితులు పడకపోవడం అలర్జీ రావడం మానసిక ఒత్తిడి కూడా హస్తమాకు కారణం అవుతాయి. బసం వ్యాధికి మందులు బిల్లల రూపంలో నాలుక కింద ఉంచి కరిగించుకునే ప్రయత్నం చేయాలి. చలి మంచు త్రీవత రోజురోజుకు పెరుగుతున్నట్టు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతి గా పండుకోవాలి, ధైర్యంగా ఉండాలి ఎప్పటికప్పుడు డాక్టర్‌ సలహాలు పాటించాలని పలువురు సూచించుచున్నారు.

Spread the love