చైనా మాజీ ప్ర‌ధాని కన్నుమూత

నవతెలంగాణ న్యూఢిల్లీ: చైనా మాజీ ప్ర‌ధాని లీ కియాంగ్(68) మరణించారు. గుండెపోటు ఆయ‌న ప్రాణాలు విడిచారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌మావేశాల్లో లీLi Keqiangని ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ ఆ అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. షాంఘైలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయ‌న‌కు గురువారం అక‌స్మాత్తుగా గుండెపోటు వ‌చ్చిన‌ట్టు ఆ దేశ మీడియా పేర్కొన్న‌ది. అర్థ‌రాత్రి ఆయ‌న ప్రాణం విడిచిన‌ట్టు మీడియా వెల్ల‌డించింది. జిన్‌పింగ్ స‌ర్కారులోనే ఆయ‌న పదేండ్లు ప్ర‌ధానిగా సేవలందించారు.
జీ జిన్‌పింగ్ సంతాపం
మాజీ ప్ర‌ధాని లీ కియాంగ్ మరణం పట్ల ఆదేశ అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ ప్రధానిగా లీ కియాంగ్ అందించిన సేవలను గుర్తు చేశారు.

Spread the love