చిప్కో ఉద్యమ నేత మురారీలాల్‌ కన్నుమూత..

నవతెలంగాణ-హైదరాబాద్ : చిప్కో, సర్వోదయ ఉద్యమాల నేత, సామాజిక కార్యకర్త మురారి లాల్ ‌(91) ఇక లేరు. రుషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో శ్వాస సంబంధిత అనారోగ్యానికి చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారీలాల్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. మురారీలాల్‌ తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. లాల్‌ మృతికి ప్రముఖ పర్యావరణవేత్త చండీ ప్రసాద్‌ భట్‌ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, మురారీలాల్‌ సేవలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలు గుర్తించి గౌరవించాయి.

Spread the love