నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి కిందట పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. “తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి హార్దిక శుభాభినందనలు. మీ నాయకత్వంలో మన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా నియమితుడైన మల్లు భట్టి విక్రమార్కకు, నూతన మంత్రివర్గానికి, కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కూడా చిరంజీవి విషెస్ తెలిపారు.

Spread the love