నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ క్రీడలు పారిస్‌లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పాల్గొని విజయం సాధించిన క్రీడా విజేతలందరికీ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘‘షూటింగ్ స్టార్స్ సరబ్‌జ్యోత్ సింగ్, మను బాకర్, స్వప్నిల్, ఇండియా హాకీ టీమ్, హాకీ ఆటగాడు శ్రీజేశ్, జావెలిన్ ఛాంపియన్ నీరజ్‌చోప్రా, స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ సహా, ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది క్రీడాకారులకు నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా వినేశ్ ఫొగాట్ నీవు నిజమైన పోరాట యోధురాలివి’’ అంటూ అందరికి ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు.