అమితాబ్ బచ్చన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి

Chiranjeevi wishes Amitabh Bachchan on his birthday నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నేడు 82వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రియాతిప్రియమైన అమితాబ్ బచ్చన్ గారికి ఈ పుట్టినరోజు ఎంతో సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షుతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అసమాన నటనా ప్రతిభతో కోట్లాది మందిని ఉర్రూతలూగించాలని, స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Spread the love