చిత్ర క‌ళే ఊపిరిగా..

చిత్రలేఖనం కృషి, సృజనాత్మకతతో కూడుకున్న కళ. చిత్రించవలసిన దానిని అవగతం చేసుకోవడం, ఆపై రంగులతో అందంగా తీర్చిదిద్దడం సాధనతోనేచిత్రలేఖనం కృషి, సృజనాత్మకతతో కూడుకున్న కళ. చిత్రించవలసిన దానిని అవగతం చేసుకోవడం, ఆపై రంగులతో అందంగా తీర్చిదిద్దడం సాధనతోనే సాధ్యపడుతుంది. అలాంటి కళను చిన్న తనం నుండి వారసత్వంగా అందిపుచుకున్నారు గాయత్రి కనుపర్తి. ఎప్పటికప్పుడు తనలోని కళను మెరుగుపరుచుకుంటూ కళాభిమానుల అభిరుచికి తగ్గట్టుగా బొమ్మలు గీస్తూ దాదాపు వందకుపైగా ఎగ్జిబిషన్స్‌లో పాల్గొని క్షణం కూడా తీరిక లేకుండా చిత్రలేఖనమే ఊపిరిగా జీవిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
గాయత్రి తండ్రి శ్రీకంఠ వీరభద్రరావు, తల్లి రాజ్యలక్ష్మి. ఈమెకు ఒక తమ్ముడు శ్రీధర్‌. వీరి సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు. చీరాలలో పుట్టి పెరిగారు. గాయత్రి తండ్రి జీవించి ఉన్నప్పుడుAssistant Treasury Officer (A.T.O)గా చేసేవారు. వారు కూడా చిత్రకారులే. కేవలం రాధాకృష్ణ ఒకే సబ్జెక్ట్‌ తీసుకొని కనీసం యాభై భంగిమలు చిత్రించా రు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలతో ప్రవృత్తిగా వేస్తున్న చిత్రకళకు ఆయనకు సమ యం దొరికేది కాదు. అయినా తనకెంతో ఇష్ట మైన కళను వీలు చిక్కినప్పుడల్లా గీస్తుండేవారు. ఆయన సాహిత్యం కూడా బాగా చదివే వారు.
భర్త ప్రోత్సాహంతో…
గాయత్రి BAPATLA ENGINEERING COLLEGE లో M.sc (A.o) maths చేసారు. చదువు పూర్తి అయిన వెంటనే వివాహం చేశారు. గాయత్రిలోని కళా తృష్ణను గుర్తించిన భర్త ఉదరు భాస్కర్‌ ఆమెనెంతో ప్రోత్సహించారు. ఆమెకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని భార్య కళను ప్రపంచానికి చూపించేందుకు తనవంతు సహకారం అందించారు. భర్త ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ఆమె తన దృష్టిని చిత్రలేఖనం మీదనే కేంద్రీకరించారు. ‘నా జీవితంలో నాన్న హీరో అయితే.. ఆ తర్వాత స్థానం నా భర్తదే. నాన్నలో ఉన్న కళ నాకు వారసత్వంగా వస్తే, నన్ను ప్రోత్సాహించింది మాత్రం నా భర్తనే’ అంటూ గర్వంగా చెబుతారు ఆమె. గత 15ను ఏండ్లుగా ఒక చిత్రకారిణిగా తన కళను నలుగురికి తెలిసేలా చేసింది ఆమె భర్తనే. ఉదరు భాస్కర్‌ తన భార్యకు మంచి సలహాలు ఇస్తూ ఒక ఫిలాసఫార్‌గా మారారు. అందేకాదు ఆమె కళకు దిశ నిర్దేశాలు చేస్తున్న ఒక దార్శనీకుడు.
వంద ఎగ్జిబిషన్లలో…
గాయత్రి దాదాపు అన్నిరకాల చిత్రాలు వేస్తారు. పొట్రైట్స్‌, పెన్సిల్‌ స్కెచెస్‌, ఆకృలిక్‌ పెయింటింగ్స్‌, ఆయిల్‌ పెయింటింగ్స్‌ ఇలా ఏదైనా ఆమె చేతిలో ఎంతో అందంగా తీర్చిదిద్దబడుతుంది. కళాభిమానుల అభిరుచిని బట్టి వాళ్ళకి కావాల్సిన రీతిలో చిత్రాలను అందచేస్తారు. చిత్రకళలో ఆమె మొదటి గురువు అనంత నారాయణ. తర్వాత ప్రముఖ చిత్రకారుడు అంబరీష్‌ దగ్గర కొన్ని మెళుకువలు నేర్చుకున్నారు. ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా సుమారు వంద ఎగ్జిబిషన్స్‌లో ఆమె పాల్గొన్నారు.
ఆదరణ ఇంకా పెరగాలి
నేటి యువ చిత్రకారులకు ఏదైనా సందేశం ఇవ్వమంటే తాను ఇంకా అంత ఎదగలేదని అయితే మనలోని ఆత్మవిశ్వాసాన్ని యువత ఎప్పుడూ కోల్పోకూడదని బలంగా చెబుతున్నారు. అలాగే కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవాలని అదే మనల్ని నిలబెడుతుందని అంటున్నారు. నేటి సమాజంలో కళల పట్ల ఆదరణ కాస్త తక్కువే ఉందనీ, సమాజంలో కళల పట్ల మంచి అవగాహన కలిగి ఆదరణ ఇంకా పెరగాలని ఆమె అంటున్నారు. అన్ని రంగాల మాదిరిగా ఈ రంగంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని ఆమె అంగీకరిస్తున్నారు. అయినా వాటిని అధిగమించి చిత్రకళపై ఉన్న మక్కువతో ముందుకు పోతున్నానని అంటున్నారు.
సాహిత్య కారిణిగా…
చిత్రకళతో పాటు గాయత్రికి సాహిత్యం అన్నా ఎంతో మక్కువే. 2017లో జనని సంస్థ ద్వారా వెన్నెల గంటి, భువన చంద్ర సమక్షంలో తన కవితా సంపుటి ‘ఇట్లు..నీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆమెకు సంతృప్తి కలిగించే విషయమేంటని అడిగితే కళలు లేదా కవిత్వంలో నిష్ణాతుల దగ్గర నుండి వచ్చే నిజమైన ప్రశంసలు లేదా సలహాలు అంటారు. తనలోని చిత్రకళకు గాయత్రి అనేక పురస్కారాలు సైతం అందుకున్నారు. బాపు బొమ్మల పురస్కారం, యువకవితా సత్కారం, శ్రీ ధాత్రి పురస్కారం, ఉగాది పురస్కారం, నవరత్న మహిళా పురస్కారం ముఖ్యమైనవి. మహిళలు తమలోని శక్తి , సామర్ధ్యాలను గుర్తించి ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఇష్టమైన రంగంలో రాణించడానికి కృషిచేయాలని ఆమె అంటారు.

– పాలపర్తి సంధ్యారాణి

Spread the love