ముస్లింలకు మహిళా రిజర్వేషన్ బిల్లులో చోటేదీ: అసదుద్దీన్

asaduddin-owaisi-five-questions-to-modiనవతెలంగాణ-హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం నిన్న కొన్ని గంటలపాటు జరిపిన క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఒకటి. ఇక ఈ బిల్లును రెండు మూడు రోజుల్లో పార్లమెంట్ లో ఆమోదం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తాజాగా ఈ బిల్లుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లిం మహిళలకు అవకాశం కల్పించలేదు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బిల్లు సారాంశం ఏమిటన్నది అర్ధం కాకుండా ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చింది… చట్టసభల్లో ఇప్పటికే ఉన్న మహిళలకు కాకుండా ఎవరు అయితే తక్కువగా ఉన్నారో వారికి అవకాశం కల్పించాలి అంటూ అసదుద్దీన్ చెప్పాడు. ఇందులో ముస్లిం మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం చాలా బాధాకరం అంటూ తన ఆందోళనను తెలిపాడు. అందుకే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము అంటూ అసదుద్దీన్ తెలియచేశారు. ఇక ఇప్పటికే ఓబీసీ మహిళలు సరైన ప్రదాన్యత కల్పించలేదని కొన్ని పార్టీలు వ్యాఖ్యానించాయి.

Spread the love