నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు ఇతర భాషా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి దేవర. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుందని తెలిసిందే. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసింది తారక్ టీం. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం తాజాగా సెకండ్ సింగిల్ ‘చుట్టమల్లె’ మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్. తారక్, జాన్వీకపూర్ కెమిస్ట్రీలో వచ్చే ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తున్నాడు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.