క్రిస్మస్ పండుగకు ముస్తాబైన చర్చిలు..

నవతెలంగాణ-ఆర్మూర్ :  క్రిస్మస్ అంటే రెండు పదాల కలయికతో ఏర్పడింది ఆంగ్లంలో క్రైస్తు +మాస్ అనే పదాలతో ఈ పండగను పిలుస్తారు. క్రిస్మస్ వేడుకలకు ఉమ్మడి జిల్లాలలోని చర్చిలు ప్రార్థన మందిరాలు ముస్తాబైనాయి. క్రైస్తవుల కళ్ళల్లో మెరుపు కనిపిస్తూ వారి గుండెల నిండా ఆరాధన భావం వెలివేస్తే సంబరమైన రోజు నేడు… ఈ సందర్భంగా నవ తెలంగాణ కథనం…

క్రిస్మస్ తాత….
క్రిస్మస్ రోజున చిన్నారులతో క్రిస్మస్ తాత వచ్చి సరదాగా ఆడుకుంటాడని వారికి బోలెడు బొమ్మలు చాక్లెట్లు ఇస్తాడని చిన్నారులు అతని కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు .నిజానికి రాత్రిళ్ళు చిన్నారులు నిద్రపోగానే వారి పక్కన గిఫ్టులు ఇచ్చి వెళుతుంటాడు .తర్వాత సంబరాల్లో వారొక చక్కని డ్రెస్సు, తెల్లటి గడ్డం పెట్టుకొని చిన్న పెద్ద అందరిని అలరిస్తాడు క్రిస్మస్ తాత…
కొవ్వొత్తులు వెలిగిస్తూ…
ఆదివారం అర్ధరాత్రి వరకు జాగరణ రాత్రికి పాటిస్తారు.. ప్రపంచం అంధకారంలో ఉందని ఏసుప్రభు ఆ చీకటిని దూరం చేసేందుకు జన్మించారని చాటేలా ప్రత్యేకంగా కొవ్వొత్తులను వెలిగిస్తారు. చిమ్మ చీకటిలో చర్చిలో కొవ్వొత్తులను వెలిగించి 8 బైబిల్ సూక్తులు ,తొమ్మిది పాటలను ఆలపిస్తూ క్రైస్తవ సోదరులు జాగరణలో పాల్గొంటారు.
ప్రధాన పండుగగా…
చారిత్రాక వేత్తల సమాచారం మేరకు క్రీస్తుశకం 336 లో ప్రభాతమంగా క్రిస్మస్ను డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారని మతగురువులు తెలుపుతున్నారు. మానవజాతిని రక్షించేందుకు దేవుడు యేసు క్రీస్తు రూపంలో జన్మించాడని విశ్వసిస్తూ ఈ పర్వదినాన్ని నిర్వహిస్తున్నారు ..1100 సంవత్సరం నుండి యూరప్ లో క్రిస్మస్ను ప్రధాన పండుగగా చేసుకోవడం విశేషం..
క్రిస్మస్ ట్రీ… క్రిస్మస్ స్టార్
ప్రకృతిని కూడా ఆరాధించే క్రిస్మస్ పండగ రూపుదిద్దుకుంటుంది ప్రధానంగా క్రిస్మస్ ట్రీ గా వ్యవహరించే చెట్లను అందంగా అలంకరిస్తారు. పూర్వం  ఓ కు చెట్లను పూజించేవారు. క్రిస్మస్ చెట్లను ప్యారడైజ్ ట్రీ గా కూడా వ్యవహరిస్తారు. ప్రతి నిత్యం పచ్చగా ఉంటూ ప్రజలను సంతోషంగా సుఖంగా ఉంచుతుందని విశ్వసిస్తారు. ఈ చెట్లకు ఎర్రని ఆపిల్ పళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు నక్షత్రాలతో అలంకరించే ఆనవాయితీ నేటికీ క్రిస్మస్ రోజుల్లో కొనసాగుతోంది ..క్రిస్మస్ కు ప్రారంభం ముందు నుంచే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు. క్రీస్తు రాకను కాంక్షిస్తూ క్రైస్తవ ప్రార్థన మందిరాలు ఇళ్లపై అలంకరించటం ఒక సాంప్రదాయంగా నేటికీ కొనసాగుతుంది.
ఉమ్మడి జిల్లాల్లో ముస్తాబైన చర్చిలు…
క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే క్రిస్మస్ సంబరాలకు ఉమ్మడి జిల్లాలోని చర్చిలు ముస్తాబు అయినవి. జిల్లా కేంద్రంలోని అత్యంత పురాతన సి ఎస్ ఐ చర్చి తో పాటు ఆయా కాలనీలోని చర్చిలు డిచ్పల్లి ధర్మారం చర్చి, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ తదితర ప్రాంతాలలోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుపుకుంటారు .ఇప్పటికే వివిధ చర్చిల నిర్వహణ కమిటీలు క్రైస్తవ సంఘాలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేసినారు.. చర్చిలను ఆకర్షణీయమైన రంగులతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించినందుకు ఏర్పాటు చేసినారు.. మరికొన్ని చర్చిలలో ఏసుక్రీస్తు జన్మించిన పశువుల పాకల సెట్టింగ్లతో పాటు మేరీమాత ,జీసస్ విగ్రహాలను ఏర్పాటు చేసినారు.. పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల చర్చితో పాటు పలు కాలనీలో చర్చిలలో క్రిస్మస్ సంబరాలు నేడు నిర్వహిస్తున్నారు.
Spread the love