నవతెలంగాణ – ఆమనగల్
ఆమనగల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి.ప్రమోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఇక్కడకు బదిలీపై వచ్చిన సీఐ విజయ్ కుమార్ వారం రోజులకే మల్టీ జోన్ -2 కు బదిలీ అయ్యారు. ఈనేపథ్యంలో అల్వాల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ కుమార్ ఆమనగల్ సీఐగా బదిలీపై వచ్చారు. మంగళవారం బాధ్యతలు చేపట్టిన సీఐ ప్రమోద్ కుమార్ ను స్థానిక ఎస్ఐ కే.బాల్ రామ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా సీఐ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఆమనగల్ పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు.