గుండ్ల వాగు వంతెనను పరిశీలించిన సీఐ శంకర్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలో మంగళవారం భారీ వర్షం కురియడంతో గుండ్ల వాగు దయ్యాలవాగులు పొంగి ప్రవహించాయి.
దీంతో గుండ్ల వాగు వంతెన ప్రాంతంలో గతంలో పోసిన మట్టి కాస్త కృంగిపోవడంతో పసర పోలీస్ స్టేషన్ సిఐ శంకర్ ఎస్ఐ మస్తాన్ తో కలిసి వంతెన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. సిబ్బందితో భారీకేడ్ లను తెప్పించి మట్టి కుంగిన ప్రాంతంలో రక్షణగా ఏర్పాటు చేశారు. వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సైడ్ బార్కెడ్ లను ఏర్పాటు చేశారు. వర్షం తగ్గినట్లయితే మళ్లీ కొంత మొరం మట్టి పోయించాల్సిన అవసరం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులను చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా నెమ్మదిగా తమ వాహనాలను వంతెన పై నుండి తీసుకువెళ్లాలని అప్రమత్తంగా వాహనాలను నడపాలని ఆదమరిస్తే ప్రమాదం తప్పదని దానివల్ల ఇతరులకు కూడా నష్టం వాటిల్లుతుందని అన్నారు.
Spread the love