రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు

నవతెలంగాణ – విజయవాడ:మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్‌లు విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సీఐడీ రీజనల్‌ ఆఫీస్‌కి హాజరు కావాలని సీఐడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో ఏ-1గా రామోజీరావు ఉండగా, ఏ-2గా శైలజా కిరణ్‌లు ఉన్నారు. 41ఏ కింద వారికి నోటీసులు ఇచ్చింది సీఐడీ.ఈ నెల మొదటివారంలో ఏ-2గా ఉన్న శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. శైలజా కిరణ్‌ నివాసంలోనే ఆమెను సీఐడీ విచారించింది.

Spread the love