– దర్యాప్తు సంస్థల ద్వారా డిజిటల్ పరికరాల స్వాధీనంపై సుప్రీంకోర్టు
– సీనియర్ అడ్వకేట్‌కు ఆదేశాలు
న్యూఢిల్లీ : దర్యాప్తు సంస్థల ద్వారా ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు వంటి డిజిటల్ పరికరాల స్వాధీనంపై భారత సర్వోన్నత న్యాయస్థానం సీనియర్ న్యాయవాది నిత్యా రామకృష్ణన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో మార్గదర్శకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులేట్ చేయాలని తెలిపింది. రామ్ రామస్వామి అండ్ ఓర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓర్స్ పిల్‌లో ఐదుగురు విద్యావేత్తలు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. అక్టోబరు 3న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ న్యూస్ పోర్టల్ చైనా నుంచి నిధులు పొందిందన్న ఆరోపణలపై న్యూస్‌క్లిక్ కార్యాలయం మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని దాని జర్నలిస్టులు, ఉద్యోగులు, కన్సల్టెంట్లు, కంట్రిబ్యూటర్ల ఇండ్లపౖౖె దాడి చేసి వారి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. న్యాయమూర్తులు సంజరు కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మార్గదర్శకాలను ప్రసారం చేయాలని రామకష్ణన్‌ను ఆదేశించింది.