అభివృద్ధి పథంలో పట్టణాలు పట్టణ ప్రగతితో మెరుగులు

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషి మరువలేనిది
వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి
ఘనంగా పట్టణ ప్రగతి వేడుకలు
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నాయని వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో, మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నా యని అన్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమాన్ని పట్టణంలోని తేజా కన్వెన్షన్‌ హాల్లో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీ తా మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ శాసనసభ్యులు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడు తూ పట్టణాల్లో చాలా మార్పులు వచ్చాయని అన్నా రు. అనేక మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పట్టణాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్‌లో కూడా వికారాబాద్‌ మున్సిపల్‌ అనేక రికార్డులు సొంతం చేసుకుందని, వచ్చే సర్వేక్షన్లో మరింత మెరుగైన ర్యాంక్‌ సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కమిషనర్‌ శరత్‌ చంద్ర, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య సేవకులను సన్మానించారు. మహిళా సమైక్య వారికి చెక్కు ల పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌ బేగం, మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌ చంద్ర, ఎంపీపీ చంద్రకళ, కౌన్సిలర్లు, ఆర్డీఓ విజయ కుమారి, అధికారులు పాల్గొన్నారు.

Spread the love