– హైదరాబాద్‌లో జీసీసీ ప్రారంభం
నవతెలంగాణ – హైదరాబాద్
అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ సిటిజన్స్ ఫైనాన్సీయల్ గ్రూప్ తమ ఆవిష్కరణల వేగవంగానికి కాగ్నిజెంట్‌లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ సంస్థ ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ వ్యూహాన్ని అమలు చేయడానికి వీలుగా హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. మంగళవారం దీనిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంచనంగా ప్రారంబించారు. ఇది భారత్‌లోనే తన మొట్టమొదటి జీసీసీ అని సిటిజన్స్ ఫైనాన్సియల్ వెల్లడించింది. దీని ద్వారా 1,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాగ్నిజెంట్ కొత్త జీసీసీ సెంటర్ ద్వారా ఎంటర్‌ప్రైజ్ టెక్ సామర్థ్యాలు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌లు, డేటా అనలైజ్, ఉత్పత్తి ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. నిజానికి ఇదొక ఇన్నోవేషన్ హబ్ మాదిరిగా పనిచేస్తుందన్నారు. సిటిజన్స్ బ్యాంక్, కాగ్నిజెంట్ చేతులు కలపడంతో, భారతదేశ జీడీపీకి 1 ట్రిలియన్ డాలర్లు అందించే మొదటి రాష్ట్రంగా అవతరించే లక్ష్యానికి తెలంగాణ దగ్గరగా ఉందని మంత్రి అన్నారు.