ఆశ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు రూ.18 వేలు పెంచాలని, లెప్రసి,పల్స్ పోలియో,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు.ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి అనే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వినాయకపురం, గుమ్మడివల్లి పీహెచ్ సీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి వైద్యాధికారులు కు మంగళవారం వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆశా వర్కర్లు ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారని, కానీ వీరికి ప్రభుత్వం ఇస్తామన్న సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.పెరుగుతున్న ధరలతో చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు కొనసాగిస్తున్నారని ప్రభుత్వ వాగ్దానం మేరకు ఇకనైనా రూ.18 వేల అమలు చేయాలని లేని పక్షంలో దశలవారీగా సమస్యల పరిష్కార అయ్యేంతవరకు పోరాటాల తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు భారతి,నాగమణి,తిరుపతమ్మ,రాధ,వాణి,చిలకమ్మ,దుర్గ, విజయ తదితరులు పాల్గొన్నారు.