నవతెలంగాణ- నసూరుల్లాబాద్
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటియు ఆధ్వర్యంలో బాన్సువాడ డివిజన్ పరిధిలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రవీందర్, ఖలీల్ లు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు రూ.10 లక్షలు, మినీ టీచర్లకు రూ. 5 లక్షల బెనిఫిట్స్ అందజేయాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి నెలకు రూ. 26 వేలు కనీస వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు. కనీస వేతనాలు 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యాలు 10 లక్షలు టీచర్ కు ఆయాకు ఐదు లక్షలు అదే విధంగా టీచర్ రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి తెలంగాణ ఉద్యమంలో అంగన్వాడీ టీచర్లు కూడా కీలకంగా పాల్గొన్నారు వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్ కొండ బాన్సువాడ ప్రాజెక్టు అధ్యక్షులు మహాదేవి శివగంగా రేణుక సోనీ విజయ తదితరులు పాల్గొన్నారు