కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరంతర పోరాటం

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ
– పూడూరులో జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-పూడూర్‌
కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతరం పోరాడుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ అన్నారు. మంగళవారం పూడూరు మండల కేంద్రంలో సీఐటీయూ ఆవిర్భావ సంద ర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకునేందుకు పోరా డాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అర్జున్‌, జీపీ కార్మికులు మాసగళ్ళ శ్రీనివాస్‌, పట్నం పరమేష్‌, చిడిపల్లి చిన్నయ్య, గౌతాపురం రామయ్య , దేవిజనాయక్‌, కొత్రేపల్లి లక్ష్మి వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షులు ఆంజనేయులు, రఫిక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love