మహేంద్ర అండ్‌ మహేంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్‌లో సీఐటీయూ ఘన విజయం

నవతెలంగాణ జహీరాబాద్‌
జహీరాబాద్‌ పట్టణంలోని మహేంద్ర అండ్‌ మహేంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్‌లో శనివారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో యూనియన్‌ అధ్యక్షులుగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఘన విజయం సాధించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు 76 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. యూనియన్‌ అధ్యక్షులుగా ఎన్నికైన చుక్క రాములుకు కార్మికులు మిఠాయి తినించారు. చుక్క రాములను కార్మికులు తమ భుజస్కందాలపై ఎత్తుకొని పరిశ్రమ గేటు వద్ద సంబరాలు చేసుకున్నారు. గతంలో ఉన్న యూనియన్లు కార్మికులకు ఇచ్చిన షోకాజు నోటీసులను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కార్మికులు బాణాసంచా కాల్చుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ జిల్లాలోనే మెరుగైన వేతన ఒప్పందం చేసిన ఘనత సీఐటీయూకే దక్కుతుందన్నారు. మహేంద్ర అండ్‌ మహేంద్ర ప్రధాన ప్లాంట్లో కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు ట్రాక్టర్‌ ప్లాంట్‌లోని కార్మికులకు కూడా కల్పించేందుకు శాయశక్తులా కషి చేస్తానన్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమాలు చేసి హక్కులను సాధించుకోవాలన్నారు. యూనియన్‌ గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దశలవారీగా పూర్తి చేసేందుకు కషి చేస్తానన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి మల్లేశం జీ సాయిలు మాట్లాడుతూ మహేంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ పరిశ్రమల్లో కార్మికుల హక్కులను సాధించిన ఘనత సీఐటీయూకే దక్కుతుందన్నారు. ట్రాక్టర్‌ ప్లాంట్‌ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి రామచందదర్‌, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ మహిపాల్‌, మహేంద్ర అండ్‌ మహేంద్ర ఆటోమోటివ్‌ ప్లాంట్‌ ప్రధాన కార్యదర్శి పి రాజిరెడ్డి, నాయకులు కనకా రెడ్డి, వీరయ్య గౌడ్‌, బీ పి సి శేఖర్‌, అంజయ్య, బాబు, వంశీ, రాజు, రాములు, చంద్రశేఖర్‌, నారాయణ, నాజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.
అభినందనలు
మహేంద్ర అండ్‌ మహేంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్ల్‌లో శనివారం జరిగిన గుర్తింపు ఎన్నికల్లో యూనియన్‌ అధ్యక్షులుగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఎన్నికైన సందర్భంగా కార్మికులు, కార్మిక సంఘం నాయకులు ఆయనను అభినందించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ యజమాన్యంతో పాటు కార్మికులు కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ విజయంపై హర్షం
నవతెలంగాణ- సదాశివపేట
జహీరాబాద్‌లోని మహీంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్‌లో శనివారం యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఘన విజయం సాధించడంపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.ప్రవీణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కేవీ చేసిన మోసాలు, గత అగ్రిమెంట్‌ విషయంలో జరిగిన అన్యాయాలను కార్మికులు పసిగట్టి బీఆర్‌ఎస్‌కేవీను కార్మికులు గట్టిగా దెబ్బ కొట్టారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నీలం మల్లేశం, శ్రీనివాస్‌, రమేష్‌గౌడ్‌, ఎండీ ఖయ్యూం, మహేందర్‌రెడ్డి, మోహన్‌చారి, అంజయ్య, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ జోగిపేట
జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్‌ ప్లాంట్‌ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విజయం సాధించడం హర్షణీయమని సీఐటీయూ అందోల్‌ డివిజన్‌ కార్యదర్శి డి.విద్యాసాగర్‌ పేర్కొన్నారు. కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. సీఐటీయూ కార్మిక సంఘంతోనే తాము ఉంటామని ఆదరించిన మహీంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్‌ కార్మికులకు కృతజ్ఞతులు తెలిపారు. కార్మికులకు సీఐటీయూతోనే న్యాయం కలుగుతుందన్నారు.

Spread the love