నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజనం కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలపై స్థానిక ఎంఈవో కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ నెలల తరబడి గుడ్లు బిల్లులు వంట బిల్లులు వేతనాలు ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయని కారణంగా మధ్యాహ్న భోజన కార్మికులు నరక యాతనలు అనుభవిస్తున్నారని అన్నారు.ఏడు నెలల గుడ్లు బిల్లులు,మూడు నెలల వంట బిల్లులు, మూడు నెలల వేతనాలు ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు.వంట బిల్లుల సమస్యలపై అనేక ఆందోళనలు,సమ్మెలు నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల విడుదల చేయకపోతే మరో సమ్మెకి కార్మికులు వెళ్ళవలసి వస్తుందని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతా రాములమ్మ కనకమ్మ విజయ మురళి తదితరులు పాల్గొన్నారు.