నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు కు కుర్చీలు,చాపలు ఏర్పాటు చేయాలని,పెరుగుతున్న దరలకు తగ్గట్లుగా ఆరోగ్య లక్ష్మీ మెనూ చార్జీలు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గురువారం అంగన్వాడీ కేంద్రాల్లో స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం లో సూపర్ వైజర్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు కు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం,ప్రహరీ గోడలు లేక, చిన్న చిన్న మరమ్మతులు నోచుకోని కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు ప్రాజెక్ట్ ఆఫీస్ నెల్లో నాలుగు సార్లు వివిధ రకాల రిపోర్టు లు ఇవ్వడానికి వస్తున్నారని గత పది సంవత్సరాలుగా టిఏడిఏలు నేటికీ చెల్లించలేదని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను కార్మికులు గా గుర్తించి, కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాధ, నాగమణి, ఉషా, మణి, సుజాత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.