నవతెలంగాణ -భీంగల్
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11 నుంచి సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టే సమ్మె నోటీసును జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు అంగన్వాడి సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 11 నుండి నిరవధిక సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు అందుకు అంగన్వాడి టీచర్స్ అండ్ వెల్ఫర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు ఆధ్వర్యంలో మంగళవారం సిడిపిఓ సుధారాణికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం కొరకు అనేకమార్లు ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈ నెల 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని అంగన్వాడి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించిందని తెలిపారు.ఇటీవల రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గారితో అంగన్వాడీ ఉద్యోగుల చర్చలు జరిగి కొన్ని సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీని విస్మరించి ఉద్యోగులకు నష్టం చేసే పద్ధతుల్లో ఆదేశాలు ఇవ్వడంతో సమ్మెకు పూనుకోవాల్సి వచ్చిందని, ప్రధానంగా అంగన్వాడీ టీచర్లకు నెలకు 26 వేల రూపాయలు ఆయాలకు 19,000 చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను టీచర్లకు పది లక్షలు ఆయనకు ఐదు లక్షలు చెల్లించి వేతనంలో సగం పెన్షన్ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని తదితర 25 డిమాండ్లతో సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమ్మె కొరకు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు జ్యోతి, యమునా, చంద్రకళ, లక్ష్మి వసంత తదితరులు పాల్గొన్నారు