ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలి: సీఐటీయూ

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్  స్టాప్ నర్సులుగా పనిచేస్తున్న వారికి విధుల్లో తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. నిజామాబాద్ జిల్లాలో పదిమందికి రాత్రికి రాత్రి డ్యూటీలకు ఆపివేయడంతో తీవ్ర ఆందోళనకు చెందినారు. కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరంగా ఉంటూ అనేక రకాలుగా సేవలు అందించారు ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్మనెంట్ నర్సింగ్ ఆఫీసర్ల స్థానంలో పనిచేసిన వీరిని తొలగించడం అన్యాయం  వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అందరిని యధావిధిగా కొనసాగించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని  ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహించిన వీరిని తొలగించడంతో  కుటుంబాలు వీధిన పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు తొలగించడం తో ఆవేదన చెందుతున్నారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగులను యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి, శకుంతల దివ్య రేవతి శ్రీలత సల్మా, తదితరులు పాల్గొన్నారు.
Spread the love