ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలి : సీఐటీయు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈరోజు హన్మకొండ జిల్లా ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మేకు సంఘీబావం తెలియజేసిన సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు కాసు మాధవి సమ్మేను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18వేల రూపాయలు ఇవ్వాలని, పిఫ్, ఇ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని, పని భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5 లక్షల రూపాయలు చెల్లించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 25 వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిఐటియు రాష్ట్ర కమిటీగా మరియు పశుమిత్ర వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నుండి సంపూర్ణ సంఘీబావం తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిగా పని చేస్తున్నారు. గ్రామీణ స్థాయి పేదలకు ప్రాథమిక ఆరోగ్య సూచనలు, సలహాలు ఇస్తూ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు చేయిస్తూ, మాత – శిశు మరణాల రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైద్య ఆరోగ్య వ్యవస్థకు మూల స్థంభాలవలె పనిచేస్తున్న ఆశాలకు ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం చెల్లించకపోవడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ ఆరోగ్య పథకాలు, సంక్షేమ పథకాలు గ్రామ స్థాయికి తీసుకుపోతున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు లేక, ఆకలితో అలమటిస్తూ గత్యంతరం లేని పరిస్థితులలో సమ్మే బాట పట్టిన ఆశాలకు సిఐటియు, సిఐటియు అనుబంధ కార్మిక యూనియన్లు, ఇతర ట్రేడ్ యూనియన్లు అండగా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే ఆశాలను చర్చలకు పిలిచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది.

Spread the love