నవతెలంగాణ – నవీపేట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోన సమయంలో కార్మికుల కాళ్లు కడిగారని కానీ కార్మికులకు కావాల్సింది కడుపు నింపే చట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంపీడీవో నాగనాథ్ కు శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను జీవో నెంబర్ 51 ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 , పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఒప్పందం 148 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన బిల్లులను ఆమోదించుకున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని విమర్శించారు. రైతు సంఘం జిల్లా నాయకులు దేవేందర్ సింగ్ మాట్లాడుతూ రైతులకు ఎం ఎస్ పి ధరలను కేటాయించాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు, రాజు, పోసాని, మాణిక్యం, నర్సయ్య, సీపీఐ(ఎం) నాయకులు వసంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.