ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్స్‌ కోచింగ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖకు చెందిన తెలంగాణ రాష్ట్ర స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్ష కోసం పదినెలల రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని స్టడీ సర్కిల్‌లో 2023-24 సంవత్సరానికిగానూ కోచింగ్‌ అందించేందుకు వందమంది అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతితో పది నెలలపాటు కోచింగ్‌ ఇప్పిస్తామన్నారు. 200 మంది కూర్చునే ఏసీ ఆడిటోరియంతోపాటు మరో మూడు ఏసీ క్లాస్‌రూమ్‌లు, 80 కంప్యూటర్లతో రెండు డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

Spread the love