భూ వివాదంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నాయకుల నడుమ ఘర్షణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
భూమి వివాదంలో ఆదివారం బీఎస్పీ,బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో బీఎస్పీ నాయకుడు,అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి మడకం ప్రసాద్ కి తీవ్ర గాయాలు కాగా,బిఎస్పీ నాయకుడు కారు ధ్వంసం అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం లో స్థానిక బీఎస్పీ నాయకుడు సంఘం దుర్గారావు,బీఆర్ఎస్ నాయకుడు,స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్ కు ఓ భూమి విషయంలో గతం నుండి వివాదంలో జరుగుతుంది.  ఆ భూమి వివాదం కోర్టు పరిధిలో ఉండగా సంఘం దుర్గారావు సదరు భూమిని ఆదివారం వ్యవసాయం కోసం ట్రాక్టర్ తో దున్నే క్రమంలో, ఆ పొలాన్ని దున్న కుండ అడ్డుకోవడం కోసం వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు,బీఎస్పీ నాయకుడు ఆ పొలానికి అండగా ఉన్నాడనే అనుమానంతో తన కారు ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ తన పై భౌతిక దాడికి పాల్పడ్డారని ప్రసాద్ తెలిపాడు. వాస్తవానికి తను ఈ నెల 30 న జరగబోయే పార్టీ కార్యక్రమం పై జనసమీకరణ కోసం చర్చించడానికి సంఘం దుర్గారావు పొలం దగ్గరికి వెళ్లానని కానీ సంఘం దుర్గారావు తరపున వచ్చానని అనుమానిస్తూ నా వాహనాన్ని ధ్వంసం చేసి తన పై దాడి చేసారని వాపోయాడు. పరిస్థితి చేయి దాటి పోవడంతో ఇరువర్గాలు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Spread the love