బల్కంపేట ఎల్లమ్మగుడిలో ఘర్షణ.. ఐదుగురికి కత్తిపోట్లు

నవతెలంగాణ – హైదరాబాద్
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి లక్షల్లో భక్తులు తరలివచ్చారు. పిల్లలు, మహిళలు, వయోధికులు అందర్నీ ఒకే వరుస కేటాయించడంతో సమస్య మొదలైంది. ఈ క్రమంలోనే ఎండ తీవ్రతకు భక్తులు తాళలేకపోయారు. మరోవైపు వీఐపీ పాసులు అధికంగా జారీ చేశారు. ఇదంతా శాఖల సమన్వయలోపంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇష్టానుసారం వీఐపీ పాసులు జారీ చేయటం.. ఊహించని విధంగా లక్షలాది మంది తరలిరావటంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అధికారుల మధ్య అంతర్గత గొడవలతో.. ఎవరకివారే అన్నట్టుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. బోనాల కాంప్లెక్స్‌లో అన్నదానం వద్దంటూ పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టారు. మంగళవారం రాత్రి వేలాది మంది భక్తులు ఆలయ సమీపంలోని బోనాల కాంప్లెక్స్‌లో విడిది చేశారు. ఉదయం నుంచి అక్కడే తిష్టవేసిన మందుబాబులు, పాతనేరస్తులు.. అర్ధరాత్రి దాటాక హడావుడి చేశారు. మత్తులో భక్తులను బెంబేలెత్తించారు.

Spread the love