స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం లో బాగంగా బుధవారం ముడవ రోజు డిచ్ పల్లి మండలం లోని దర్మారం బీ గ్రామంలోని మురుగు కాలువలు, నీరు నిలిచిన ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహించారు. మూడవ రోజు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పరిషత్, ముఖ్య కార్య నిర్వహణ అధికారి బి.ఉష పాల్గొన్నారు. గ్రామాలలోని అన్ని వైద్య ఆరోగ్య శాఖ కు సంబందించిన ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో/సి హెచ్ సి/సబ్ సెంటర్ కేంద్రాలు, పశు వైద్య కేంద్రాల పరిసరాలను పరిశుబ్రం చేశారు. మురుగు కాలువలలో పుడికలు తెయించుట, వర్షం నీటితో నిండిన గుంతల నుండి ఓహెచ్ ఎస్ అర్ నీటి ట్యాంక్ల దగ్గర నీరు నిల్వకుండా నీరు ప్రవహించే విదంగా కాలువలు తియాలని, నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలలో మొరం పోయించాలని, ప్రతి ఇంటింటికి 6 మొక్కలు ఇచ్చి కచితంగా నాటే విదంగా చూడాలని ఉషా అదేశించారు. గ్రామంలోని పల్లె దావఖాన తనిఖి చేసి అక్కడ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి.యోహాన్ ( డిస్టిక్ డిప్యూటీ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ ), యం.పి.డి.ఓ. రవీందర్, యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్, పంచాయతి కార్యదర్శి సురేంద్ర మొగుల్లురు, అరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ,అశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.