మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రై డే లో భాగంగా శుక్రవారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని వైద్యాధికారి మెడికల్ ఆఫీసర్ రంజిత్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ ధనంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలను పీకి ఏరివేశారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. పచ్చదనంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసర పరిశుభ్రత పాటించి, సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సమ్మయ్య, ఫార్మసిస్ట్ శివరంజని, స్టాఫ్ నర్స్ సంతోషి, ల్యాబ్ టెక్నీషియన్ కురుసం శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.