ప్రభుత్వ సంస్థలు, బహిరంగ ప్రదేశాల శుభ్రత..

Cleanliness of government institutions and public places.నవతెలంగాణ – డిచ్ పల్లి
ఐదవ రోజు కార్యక్రమంలో బాగంగా శుక్రవారం డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలో జరిగే  స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ పాల్గొని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచడం లో భాగంగా గ్రామంలో ఉన్న  ప్రభుత్వ కార్యాలయాల సంస్థల  పరిసరాలను శుభ్రం చేయించలని, గ్రామపంచాయతీల్లోని అన్ని కుటుంబాలు శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు. ఇంటి ఆవరణలో నిలిచిపోయిన నీటిని తొలగించుకోవాలని, అన్ని కుటుంబాలు తమ ఇళ్లను శుభ్రపరచుకుంటు, ఉపయోగించని పాత సామానులలో నిల్వ ఉన్న నీటిని తొలగింప చేయలని, అన్ని కార్యాలయాలు డ్రై డే పాటించాలని పేర్కొన్నారు.ఇంటి పరిసర ఆవరణలో టీ కప్పులు, టైర్లు , సీసాలు వంటి వస్తువులలో నిల్వ ఉన్న నీటిని తొలగించవలని వివరించారు. అవసరం లేని వస్తువులు ఉన్నటువంటి సెగ్రిగేషన్ షెడ్ కు తరలింప చేయవలని, పతటైర్లు, కంటైనర్, కార్నర్లు వర్షపునీటి స్టోరేజి గా పనిచేస్తాయని, దోమల పెరగడానికి దారితీస్తాయని చెప్పారు. రోడ్డు పక్కన ఎండిన, కుళ్లిపోయిన చెట్లు, కొమ్మలను తొలగించాలని ఆదేశించారు.ఉపాది హామీ అధికారులతో కలసి, వైకుంఠ ధామాలలో సరిహద్దుల వెంబడి క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ ప్లాంటేషన్ చేయించాలని పేర్కొన్నారు. వనమహోస్తావం కార్యక్రమంలో బాగంగా రాంపూర్ గ్రామంలోని  వృద్దాశ్రమం లో, ప్రభుత్వ స్థలంలో,  పాఠశాలలో 2000 వేల మొక్కలను నాటే కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి.యోహాన్ ( డిస్టిక్ డిప్యూటీ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ ) యం.పి.డి.ఓ. రవీందర్ , యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతి ప్రత్యెక అధికారి ఉప తహసిల్దార్ డిచ్ పల్లి  శ్రీకాంత్ లతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా  పంచాయతి కార్యదర్శి వేముల దివ్య  సిబ్బంది, ఉపాది హామీ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love