భారీ సెట్‌లో క్లయిమాక్స్‌

భారీ సెట్‌లో క్లయిమాక్స్‌నాని తన అప్‌ కమింగ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోద శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్‌ పవర్‌-ప్యాక్డ్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ యూనిక్‌ అడ్వంచర్‌ని హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర బందం క్లైమాక్స్‌ చిత్రీకరణను ప్రారంభించింది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ, సంగీతం: జేక్స్‌ బిజోరు, డీవోపీ: మురళి జి, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

Spread the love