నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏదైనా వృత్తిలో నిశిత పరిశీలనలో విధులు నిర్వహిస్తే ఆ పనిపై అవగాహన పెరగడంతో పాటు, నైపుణ్యం అబ్బుతుంది అని ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి వృత్తి విద్యా విద్యార్ధులకు సూచించారు. సత్తుపల్లిలోని మదర్ థెరిసా కళాశాల నుండి పలువురు విద్యార్ధులు వృత్తి నైపుణ్యం పెంపు శిక్షణ నిమిత్తం బుధవారం ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట నూనె ఉత్పత్తి పరిశ్రమలో ఇంజనీరింగ్, వెల్డింగ్ పనులు ను పరిశీలించారు. ముందుగా బాల క్రిష్ణ విద్యార్ధులకు పరిశ్రమలో ఏమేమి పనులు చేపడతారు, వాటిని విద్యార్ధులుగా ఎలా అర్ధం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అనే అంశాలను బోధించారు.అనంతం పరిశ్రమ సిబ్బంది నిర్వహిస్తున్న పనుల్లో విద్యార్ధులు ఆసక్తిగా పాల్గొన్నారు.