కాసేపట్లో సీఎల్పీ సమావేశం..

నవతెలంగాణ – హైదరాబాద్: గచ్చిబౌలిలోని హోటల్‌కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్లాకి చేరారు. నేడు 9.30కి సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎల్పీ నేత ఎన్నిక జరగనుంది. సీఏం ఎంపిక విషయంలో అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేయనుంది. రేవంత్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ప్రజాదరణ కలిగిన నాయకుడిగా రేవంత్‌కి గుర్తింపు ఉంది. 88 సభల్లో పాల్గొని కాంగ్రెస్ గెలుపులో రేవంత్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. వీలైతే నేడు కాంగ్రెస్ సీఏం, డిప్యూటీ సీఏంతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు సప్తమి ఉన్నందున ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లేదంటే ఈ నెల 6న ప్రమాణ స్వీకారం ఉండనుంది. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తే గ్రాండ్‌గా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్‌ను కాంగ్రెస్ నాయకులు కోరారు.

Spread the love