సీఎల్పీ సమావేశం ప్రారంభం.. 64 మంది ఎమ్మెల్యేల హాజరు

clp-meeting-soonనవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించే సీఎల్పీ సమావేశం ప్రారంభమయింది. హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో ఈ సమావేశం కొనసాగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రేల నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులంతా సీఎల్పీ సమావేశానికి హాజరుకావాలని నిన్ననే ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మొత్తం 64 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు క్లియర్ మెజార్టీ రావడంతో క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేకపోయింది. అయినప్పటికీ గెలిచిన ప్రతి ఎమ్మెల్యేపై పార్టీ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసింది. మరోవైపు, ఈ సమావేశంలో సీఎల్పీ లీడర్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి ఏకవాక్య తీర్మానం చేయబోతున్నారు. సీఎల్పీగా ఎంపికయ్యేవారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు.

Spread the love