నవతెలంగాణ – అమరావతి: ఈ నెల 17లోపు వరద పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. ఉప్పుటేరు, ఎర్ర కాలువ వరదలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి, అత్యంత వేగంగా పూర్తి చేస్తామన్నారు.