ముస్లింలకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

నవతెలంగాణ – హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహార వితరణ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘త్యాగగుణాన్ని ప్రబోదించే బక్రీద్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి అని ప్రజల్లో స్వార్థం, రాగద్వేషాలు ఉండకూడదు. మానవుల్లో త్యాగనిరతిని పెంచడమే బక్రీద్ ఉద్దేశం. సమైక్యత, సమానత్వం గురించి ప్రతిఒక్కరూ ఆలోచించాలి.’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Spread the love