తిరుమలలో వకుళమాత వంటశాల ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu inaugurated Vakulamata Kitchen in Tirumalaనవతెలంగాణ – అమరావతి: తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. రోజుకు 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చని వెల్లడించారు. 18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చని తెలిపారు. తరిగొండ వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని అన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్ లు ఏర్పాటు చేశామని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Spread the love