నవతెలంగాణ – అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో సీఎంగా ఎలా పరిపాలించానో అందరికీ తెలుసని, మరోసారి 1995 నాటి సీఎంను చూస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “1995లో సీఎంగా నా పనితీరు చూశారు. ఇక ముందుకు కూడా ఆనాటి సీఎంను చూస్తారు. సోషల్ మీడియాలో ఇదివరకు లాగా ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి. సెకీ ఒప్పందం మాకు లడ్డూలా దొరికిన విషయం వాస్తవమే. అయినప్పటికీ చట్టం ప్రకారమే ముందుకు వెళతాం. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.