రేపు తిరుపతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu will visit Tirupati tomorrowనవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు రేపు తిరుపతి శ్రీ సిటీలో పర్యటించనున్నారు. శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీ సిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1,213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రేపటి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. కాగా, చంద్రబాబు రేపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు. ఇక్కడి సోమశిల ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమశిలలో వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను పరిశీలించనున్నారు.

Spread the love