
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం నిర్వహించారు. మండల స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 20 న జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఎంపీడీవో వేణుమాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎస్సై క్రాంతి కిరణ్, ఎంఈవో బుధారపు శ్రీనివాస్, పీఈటీలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.