జర్నలిస్టులకు 15వేలు పెన్షన్..

నవతెలంగాణ – హర్యానా: సీనియర్ జర్నలిస్టులకు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శుభవార్త తెలిపారు. జర్నలిజం రంగంలో రాష్ట్రం కోసం సేవలందిస్తున్న వారికి ఇస్తున్న రూ.10 వేల పెన్షన్‌ను ఇప్పుడు రూ.15 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్‌ను పెంచడంతో సీనియర్ జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love