మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతి ఇస్తున్నందుకు గర్విస్తున్నా : సీఎం జగన్

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ బిల్లుకు తాను మద్దతి ఇస్తున్నందుకు గర్విస్తున్నానంటూ సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మహిళా సాధికారత చాలా ముఖ్యమైన అంశమని, ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సమాన ప్రాతినిథ్యాన్ని నిర్ధారించడం ద్వారా కూడా దీనిని సాధించామని పేర్కొన్నారు. కలిసికట్టుగా… ప్రకాశవంతమైన, సమానమైన భవిష్యత్తును సృష్టిద్దామని పిలుపునిచ్చారు.

Spread the love