నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం జగన్‌ నేడు (28 బుధ­వారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖ చేరుకుని ఏయూ కన్వె­న్షన్‌ సెంటర్‌లో జరిగే పార్టీ నేత కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్‌ పర్యటన వాయిదా పడింది.

Spread the love