సంపతమ్మ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు ఏ కష్ణారావు, హిందుస్థాన్‌ టైమ్స్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ ఏ శ్రీనివాసరావుల తల్లి సంపతమ్మ (88) మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌తో ఆమె భర్త అప్పరుసు శేషగిరిరావు కలిసి పనిచేశారు. సంపతమ్మ కరుడుగట్టిన తెలంగాణ వాది. సీఎం కేసీఆర్‌కు వీరాభిమాని. సంపతమ్మ తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాతా అనేక సందర్భాల్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేవారు. వీరికి ఐదుగురు కుమారులున్నారు.

Spread the love